CoronaVirus LockDown | Drags All Sections of Businessmen on to Roads | Especially Poor People & Street Vendors
కరోనా కేవలం వైరస్ బాధితులనే కాదు.. మనుషులందరునీ తీవ్రంగా బాధపెడుతోంది. వైరస్ వెన్నువిరిచేందుకు.. లాక్‌డౌనే మార్గంగా ఎంచుకున్న భారత్.. సమర్థంగా అమలుచేస్తోంది కూడా. కానీ, ఆంక్షల చక్రాల కిందపడి నలిగిపోతున్నాయి బడుగుల జీవితాలు. పనిలేక, పస్తులుండలేక నానాయాతనలు పడుతూ ఇంటిముఖం పడతున్న కూలీల వ్యథలు రోజూ కనిపిస్తున్నాయి. దారుణమైన పరిస్థితుల్లో ఉపాధిలేక, పనులు నడవక శ్రమజీవులు కన్నీళ్లతోనే కడుపునింపుకుంటున్న హృదయవిదారక ఘటనలు కనిపిస్తున్నాయి. మరి... సొంతూళ్లలోనే పనులు లేక, చిల్లిగవ్వ రాక.. కుటుంబాలను పోషించుకోలేక... దారణమైన అవస్థలు పడుతున్న రోజువారీ శ్రమజీవుల మాంటేంటి ? కులవృత్తులు, చేతివృత్తులు, చిరువ్యాపారులను.. వారి అవస్థలు పట్టించుకనే నాథుడేడి ?
() కంటికి కనిపించని కరోనా వైరస్... అగ్రదేశాల అధినేతలకే కునుకు లేకుండా చేస్తోంది. ఇక సామాన్యులు పరిస్థితి చెప్పనక్కర్లేదు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా కులవృత్తులవారి రోజుల దయనీయంగా గుడుస్తున్నాయి. వైరస్ వల్ల వచ్చిన ఇబ్బందులు... రోజు గడవనీయకుండా చేస్తున్నాయి. ప్రధానంగా చేతివృత్తులకు ఎండాకాలంలో చేతినిండా పని ఉండేది. ఆ పనికి తగ్గ సంపాదనా ఉంటుంది. కానీ, ఇప్పడు పనీ లేదు. పైసలు లేవు. ఖాళీగా ఇంటిపట్టునే ఉండాల్సిరావడంతో... చిల్లిగవ్వ రావట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఎలా గడస్తుందో అన్న చింత ఓ వైపుంటే... భవిష్యత్తేమిటనే బెంగ మరో వైపు. అసలు ఎప్పుడు మళ్లీ సాధారణ పరిస్ధితులు వస్తాయన్నది అర్థం కాక అయోమయంలో ఉన్నారు... వివిధ కుల వృత్తుల శ్రామికులు. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలకు ఇకనైనా తెరపడాలని కోరుకుంటున్నారు.
() చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునేవారే కాదు. కరోనా, లాక్‌డౌన్ ప్రభావం చవి చూడని రంగమంటూ లేదు. బహుళజాతి సంస్థల నుంచి బడుగుజీవుల వరకు అందరూ ప్రభావితమయ్యా రు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు... అందరూ ఇబ్బంది పడ్డారు. ఇంకా పడుతున్నారు. కాయకష్టం చేసుకునే బడుగుజీవుల బతుకులు మరింత దుర్భరమయ్యాయి. ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునే వారి జీవన భృతిపై కరోనా కోలుకోలేని దెబ్బే కొట్టేసింది. పట్నాల్లో మెకానిక్‌ల నుంచి పల్లెల్లో చిన్న-చిన్న మరమ్మతులు చేసేవారి దాకా, గృహోపకరణాల మొదలు, పెళ్లిళ్లలో క్యాటరింగ్ చేసేవారి వరకూ.. బడ్డీ కోట్లు నడిపే చిరు వ్యాపారులు...ఇలా ఏ పూటకాపూట పని చేసుకునేవారి జీవితాల్లో చీకట్లే నింపింది. ఓ వైపు కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అన్న ఆందోళన... మరోవైపు ఉపాధి కోల్పోయి.. జీవనం ఎలా సాగుతుందా అన్న ఆవేదన.
#IdiSangathi
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
CoronaVirus LockDown | Drags All Sections of Businessmen on to Roads | Especially Poor People & Street Vendors కరోనా కేవలం వైరస్ బాధితులనే కాదు.. మనుషులందరునీ తీవ్రంగా బాధపెడుతోంది. వైరస్ వెన్నువిరిచేందుకు.. లాక్‌డౌనే మార్గంగా ఎంచుకున్న భారత్.. సమర్థంగా అమలుచేస్తోంది కూడా. కానీ, ఆంక్షల చక్రాల కిందపడి నలిగిపోతున్నాయి బడుగుల జీవితాలు. పనిలేక, పస్తులుండలేక నానాయాతనలు పడుతూ ఇంటిముఖం పడతున్న కూలీల వ్యథలు రోజూ కనిపిస్తున్నాయి. దారుణమైన పరిస్థితుల్లో ఉపాధిలేక, పనులు నడవక శ్రమజీవులు కన్నీళ్లతోనే కడుపునింపుకుంటున్న హృదయవిదారక ఘటనలు కనిపిస్తున్నాయి. మరి... సొంతూళ్లలోనే పనులు లేక, చిల్లిగవ్వ రాక.. కుటుంబాలను పోషించుకోలేక... దారణమైన అవస్థలు పడుతున్న రోజువారీ శ్రమజీవుల మాంటేంటి ? కులవృత్తులు, చేతివృత్తులు, చిరువ్యాపారులను.. వారి అవస్థలు పట్టించుకనే నాథుడేడి ? () కంటికి కనిపించని కరోనా వైరస్... అగ్రదేశాల అధినేతలకే కునుకు లేకుండా చేస్తోంది. ఇక సామాన్యులు పరిస్థితి చెప్పనక్కర్లేదు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా కులవృత్తులవారి రోజుల దయనీయంగా గుడుస్తున్నాయి. వైరస్ వల్ల వచ్చిన ఇబ్బందులు... రోజు గడవనీయకుండా చేస్తున్నాయి. ప్రధానంగా చేతివృత్తులకు ఎండాకాలంలో చేతినిండా పని ఉండేది. ఆ పనికి తగ్గ సంపాదనా ఉంటుంది. కానీ, ఇప్పడు పనీ లేదు. పైసలు లేవు. ఖాళీగా ఇంటిపట్టునే ఉండాల్సిరావడంతో... చిల్లిగవ్వ రావట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఎలా గడస్తుందో అన్న చింత ఓ వైపుంటే... భవిష్యత్తేమిటనే బెంగ మరో వైపు. అసలు ఎప్పుడు మళ్లీ సాధారణ పరిస్ధితులు వస్తాయన్నది అర్థం కాక అయోమయంలో ఉన్నారు... వివిధ కుల వృత్తుల శ్రామికులు. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలకు ఇకనైనా తెరపడాలని కోరుకుంటున్నారు. () చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునేవారే కాదు. కరోనా, లాక్‌డౌన్ ప్రభావం చవి చూడని రంగమంటూ లేదు. బహుళజాతి సంస్థల నుంచి బడుగుజీవుల వరకు అందరూ ప్రభావితమయ్యా రు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు... అందరూ ఇబ్బంది పడ్డారు. ఇంకా పడుతున్నారు. కాయకష్టం చేసుకునే బడుగుజీవుల బతుకులు మరింత దుర్భరమయ్యాయి. ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునే వారి జీవన భృతిపై కరోనా కోలుకోలేని దెబ్బే కొట్టేసింది. పట్నాల్లో మెకానిక్‌ల నుంచి పల్లెల్లో చిన్న-చిన్న మరమ్మతులు చేసేవారి దాకా, గృహోపకరణాల మొదలు, పెళ్లిళ్లలో క్యాటరింగ్ చేసేవారి వరకూ.. బడ్డీ కోట్లు నడిపే చిరు వ్యాపారులు...ఇలా ఏ పూటకాపూట పని చేసుకునేవారి జీవితాల్లో చీకట్లే నింపింది. ఓ వైపు కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అన్న ఆందోళన... మరోవైపు ఉపాధి కోల్పోయి.. జీవనం ఎలా సాగుతుందా అన్న ఆవేదన. #IdiSangathi #EtvAndhraPradesh
