Social News XYZ     

YS Jagan Dresses Down Rajahmundry MP Margani Bharat For 100 Crores Corruption

అవినీతిపై జగన్ ఉక్కుపాదం..
రాజమండ్రి ఎంపీకి లెఫ్ట్ అండ్ రైట్...

అవినీతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంత తీవ్రంగా స్పందిస్తారో మనం గతంలో చాలా సార్లు చూశాం..అది ఏ స్థాయిలో జరిగినా, తన సహచరులు..అనుచరులే చేసినా ఆయన స్పందన, శిక్షించే వేగం ఊహాతీతంగా ఉంటుంది.. ఇప్పుడు తాజాగా మరో ఉదంతం వెలుగుచూసింది.. పేదలకు పంచాల్సిన ఆవా భూముల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి యువ ఎంపీ మార్గాని భరత్ ను జగన్ తీవ్రంగా మందలించినట్లు సమాచారం..

దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుప్పుమనడంతో ముఖ్యమంత్రి జగన్ వెంటనే భరత్ ను పిలిపించినట్లు తెలుస్తోంది.. పిలవడమే కాదు..మొదటి సారి ఎంపీ అయిన భరత్ ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద స్కామ్ లో ఇరుక్కోవడం పట్ల జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట..మొదట నా ప్రమేయం ఏమీ లేదని భరత్ అనడంతో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయి..సాక్ష్యాధారాలు..కాల్ రికార్డ్స్ చూపించారట..దాంతో ఎంపీ షాక్ తిని మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.. ఆ తర్వాత ప్రత్యేకంగా ఒంటరిగా గదిలోకి పిలిచి మరీ మందలించినట్లు తెలుస్తోంది..కోపంతో జగన్ ఆ గదిలో చెంపదెబ్బలు కూడా వేసినట్లు కొందరు చెబుతున్నారు.. ఇలాంటి తప్పుడు పనుల్లో వేలుపెడితే మరో సారి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఎంపీ కాళ్లబేరానికి వచ్చినట్లు వినికిడి..

 

ఈ ఉదంతం వైఎస్సార్సీపీలో కలకలం సృష్టిస్తోంది..జగన్ చర్య అందరిలోనూ వణుకు పుట్టించింది..తన సొంత మనుషులు..బంధువులు, పదవుల్లో ఉన్నవాళ్లు..పార్టీ నేతలు..వారు ఏ స్థాయిలో ఉన్నా జగన్ వదిలిపెట్టరనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.. నిజానికి భరత్ విషయంలో జగన్ ఎంతో ఉదారంగా ఉండేవారు.. యువకుడైన భరత్ ను పార్టీ పార్లమెంటరీ పార్టీకి చీఫ్ విప్ గా కూడా నియమించాడు..ఆ నమ్మకాన్ని భరత్ పోగొట్టుకోవడం, జగన్ ఏమాత్రం క్షమించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. వచ్చే శీతాకాల సమావేశాల నాటికి పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి కూడా భరత్ ను తొలగించబోతున్నట్లు సమాచారం..

సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జగన్ ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే.. అలాంటిది ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు భూముల పంపిణీ కార్యక్రమంలో అవినీతి జరిగితే ఊరుకుంటారా...? గోదావరి ముంపు ప్రాంతమైన ఆవా భూముల విషయంలో అదే జరిగింది.. భూముల ధరల్ని కృత్రిమంగా పెంచి దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు గుప్పుమంది.. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు చేయడంతో జగన్ పూర్తి స్థాయిలో ఆరా తీసి బాధ్యుల పట్ల కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సందర్భంగా జగన్ సత్యం రామలింగరాజు ఉదంతాన్ని భరత్ కు గుర్తు చేసినట్లు చెబుతున్నారు..పాపం మొదటి సారి ఎంపీ అయిన భరత్ ముఖ్యమంత్రి జగన్ కోపానికి, ఆగ్రహానికి బిత్తరపోయినట్లు పార్టీ వర్గాల సమాచారం.. దీంతో అవినీతి అనే మాట వింటేనే వైసీపీలోని అన్ని స్థాయిల నేతలు, ప్రభుత్వ యంత్రాంగం భయపడిపోయే స్థితి వచ్చిందని చెబుతున్నారు..

Facebook Comments
YS Jagan Dresses Down Rajahmundry MP Margani Bharat For 100 Crores Corruption

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: