Toxic Gas Leakage Issue | Still Haunts Visakhapatnam Residents | Special Story
LG పాలిమర్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా... ఆ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి ఘటనతో తీవ్రమైన భయాందోళనకు గురైన సమీపంలోని 3, 4 గ్రామాల ప్రజలు... బంధువుల, స్నేహితుల ఇళ్లకు తరలివెళ్లిపోయారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలా ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా వెళ్లిపోవడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పోలీసు రక్షణ ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో ఓవైపు LG పరిశ్రమ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మరోవైపు... గ్రామంలో సురక్షిత పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నాలూ సాగుతున్నాయి. పరిశ్రమలు..! వేలాదిమందికి ఉపాధి కల్పించటంలో.. వేల కోట్ల రూపాయల ఆదాయం అందించటంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. దేశాభివృద్ధిలో భాగమయ్యే ఈ సంస్థల నుంచి వెలువడే విషపదార్థాల వల్ల ప్రజలకు పెనుముప్పు పొంచి ఉంది. రకరకాల కారణాలతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. కార్మికులు గాయాల బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే... విశాఖ వెంకటాపురం LG పాలిమర్స్‌లో జరిగిన ఘటన ఇందుకు పూర్తి భిన్నమైంది. పరిశ్రమకు ఏ సంబంధం లేని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడి ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. వైద్యులు సకాలంలో స్పందిస్తే బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని నిరూపించింది.. విశాఖ గ్యాస్ లీక్ ఘటన. విషవాయువు బారినపడి వందల మందికి వైద్యం అందించాల్సిన వచ్చినా... ఏ మాత్రం వెనకడుగు వేయక.... అలసత్వం చూపక.... అందరికి మెరుగైన వైద్యం అందించటం కోసం.. అనుక్షణం ప్రయత్నించారు. ప్రమాదకర గ్యాస్ ఎక్కువగా పీల్చడం వల్ల ఎదురైన ఇబ్బంది తొలగించేందుకు శాయశక్తులా కృషి చేశారు. శ్వాస సంబంధింత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అక్సిజన్ ఇస్తూ... వేగంగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.. కేజీహెచ్ వైద్య సిబ్బంది బృందాలు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో వందలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన వైద్యుల పనితీరుపై ఈటీవీ కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. గాలి గరళమై..ప్రజల ప్రాణాలు బలి తీసుకోవటం ఇదే తొలిసారి కాదు. దేశంలో ఇలాంటి దుర్ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. భోపాల్ ఉదంతం ఒక్కటి చాలు...పారిశ్రామిక ప్రమాదాలు మిగిల్చే శోకం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవటానికి. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఏ మేర సంచలనమైందో చూస్తూనే ఉన్నాం. ఈ ప్రమాదంలో ఉక్కిరి బిక్కిరైన బాధితులను చూస్తుంటే... భోపాల్ ఘటన కళ్ల ముందు కట్టినట్టే కనిపించింది. ఆ ప్రమాదంతో పోల్చితే...అదృష్టవశాత్తూ... విశాఖ ఘటనలో ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోయినా దేశమంతటనీ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది
#IdiSangathi
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Toxic Gas Leakage Issue | Still Haunts Visakhapatnam Residents | Special Story LG పాలిమర్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా... ఆ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి ఘటనతో తీవ్రమైన భయాందోళనకు గురైన సమీపంలోని 3, 4 గ్రామాల ప్రజలు... బంధువుల, స్నేహితుల ఇళ్లకు తరలివెళ్లిపోయారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలా ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా వెళ్లిపోవడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పోలీసు రక్షణ ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో ఓవైపు LG పరిశ్రమ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మరోవైపు... గ్రామంలో సురక్షిత పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నాలూ సాగుతున్నాయి. పరిశ్రమలు..! వేలాదిమందికి ఉపాధి కల్పించటంలో.. వేల కోట్ల రూపాయల ఆదాయం అందించటంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. దేశాభివృద్ధిలో భాగమయ్యే ఈ సంస్థల నుంచి వెలువడే విషపదార్థాల వల్ల ప్రజలకు పెనుముప్పు పొంచి ఉంది. రకరకాల కారణాలతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. కార్మికులు గాయాల బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే... విశాఖ వెంకటాపురం LG పాలిమర్స్‌లో జరిగిన ఘటన ఇందుకు పూర్తి భిన్నమైంది. పరిశ్రమకు ఏ సంబంధం లేని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడి ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. వైద్యులు సకాలంలో స్పందిస్తే బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని నిరూపించింది.. విశాఖ గ్యాస్ లీక్ ఘటన. విషవాయువు బారినపడి వందల మందికి వైద్యం అందించాల్సిన వచ్చినా... ఏ మాత్రం వెనకడుగు వేయక.... అలసత్వం చూపక.... అందరికి మెరుగైన వైద్యం అందించటం కోసం.. అనుక్షణం ప్రయత్నించారు. ప్రమాదకర గ్యాస్ ఎక్కువగా పీల్చడం వల్ల ఎదురైన ఇబ్బంది తొలగించేందుకు శాయశక్తులా కృషి చేశారు. శ్వాస సంబంధింత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అక్సిజన్ ఇస్తూ... వేగంగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.. కేజీహెచ్ వైద్య సిబ్బంది బృందాలు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో వందలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన వైద్యుల పనితీరుపై ఈటీవీ కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. గాలి గరళమై..ప్రజల ప్రాణాలు బలి తీసుకోవటం ఇదే తొలిసారి కాదు. దేశంలో ఇలాంటి దుర్ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. భోపాల్ ఉదంతం ఒక్కటి చాలు...పారిశ్రామిక ప్రమాదాలు మిగిల్చే శోకం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవటానికి. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఏ మేర సంచలనమైందో చూస్తూనే ఉన్నాం. ఈ ప్రమాదంలో ఉక్కిరి బిక్కిరైన బాధితులను చూస్తుంటే... భోపాల్ ఘటన కళ్ల ముందు కట్టినట్టే కనిపించింది. ఆ ప్రమాదంతో పోల్చితే...అదృష్టవశాత్తూ... విశాఖ ఘటనలో ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోయినా దేశమంతటనీ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది #IdiSangathi #EtvAndhraPradesh
