Social News XYZ     

Actor Raghu Babu Donates 1 Lakh To Carona Crisis Charity

సి సి సి కి. రఘుబాబు లక్ష రూపాయల విరాళం

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు సి సి సి కి. ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు గారి తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ లక్ష రూపాయలను  నెఫ్ట్ ద్వారా సీసీసీ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇచ్చారు.

ఈ సందర్భంగా  రఘుబాబు  మాట్లాడుతూ  ప్రస్తుతం మన ప్రపంచం ఎంతదారుణస్థితిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. కరోనా కోట్లాదిమంది ప్రజలు అతలాకుతలమయిపోతున్నారు. మన తెలుగు చిత్ర సీమలో వేలాదిమంది కార్మికులు..రోజువారి జీత కార్మికులు నానాకష్టాలు పడుతున్నారు. వాళ్లందరి సహాయార్థం కోసం మన మెగాస్టార్ చిరంజీవి గారు సిసిసి అనే సంస్థను ఏర్పాటు చేశారు. దయగల మన సినీ కళాకారులందరు ఎంతోమంది విరాళాలు ఇచ్చారు..ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఆ సంస్థ ఛైర్మన్ శ్రీ చిరంజీవి గారు..కమిటీ సభ్యులు శ్రీ సురేష్ బాబు గారు..శ్రీ తమ్మారెడ్డి భరధ్వాజ్ గారు..శ్రీ సి.కల్యాణ్ గారు..శ్రీ బెనర్జీ గారు..శ్రీ దాముగారు..శ్రీ ఎన్ కౌంటర్ శంకర్ గారు..శ్రీ మెహర్ రమేష్ గారు..వీళ్లందరి నేతృత్వంలోఆ విరాళాలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రతి పేదవాడి నోటికి అందిస్తున్నారు. ఈ సంస్థలో మనం కూడా భాగస్వాములమవుదాం. ప్రతి పేదవాడి నోటికి పట్టెడన్నం పెడదాం. ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి. కరోనాని తరిమి కొట్టండి. మీ రఘుబాబు. జైహింద్..

 

Facebook Comments