Social News XYZ     

SR Kalyana Mandapam Movie Meme Poster

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ' SR కళ్యాణమండపం - Est. 1975 ' చిత్రం‌ మీమ్ పోస్టర్ కి అనూహ్య స్పంద‌న‌

రాజావారు రాణిగారు సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నుంచి SR కళ్యాణమండపం - Est. 1975 స అనే క్రైమ్ కామెడీ ల‌వ్ స్టోరీ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్క‌ర్ న‌టిస్తోంది. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్, ప‌తాకం పై రాజు, ప్ర‌మోదుల నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వినూత్న‌మైన టైటిల్ పెట్టి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన ఈ చిత్ర బృందం తాజాగా మీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మీమ్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సూటిగా చెప్ప‌డ‌మే కాకుండా, ఈ మీమ్స్ లో హ్యూమ‌ర్ కూడా ఉండ‌టం విశేషం. ఇదే ఫార్మాట్ ని SR కళ్యాణమండపం - Est. 1975 టీమ్ కూడా ఫాలో అయింది. తెలుగు చల‌న చిత్ర సీమ‌లో తొలిసారిగా మీమ్స్ టెంప్లేట్ ని ఉప‌యోగించి అఫిషీయ‌ల్ గా పోస్టర్ ని రిలీజ్ చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా కాలేజీ స్టూడెంట్స్ గా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని మ‌రోసారి ఈ మీమ్ పోస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఆడియెన్స్ కి రివీల్ చేశారు.

 

హ్యూమ‌ర్, రొమాన్స్, ఫ‌న్ జోడించిన డైలాగ్స్ తో ఈ మీమ్ పోస్టర్ రెడీ చేశారు SR కళ్యాణమండపం - Est. 1975 టీమ్. దీంతో ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో అనుహ్య‌మైన స్పంద‌న రావ‌డ‌మే కాకుండా వైరల్ అవుతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో సాయికుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇక లాక్ డౌన్ పిరీయ‌డ్ ముగిసిన వెంట‌నే ఈ సినిమా షూటింగ్ ని పునః ప్రాంరంభించి సాధ్య‌మైనంత త్వ‌ర‌లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో నిర్మాత‌లు రాజు - ప్ర‌మోద్ స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు

కిరణ్ అబ్బ‌వ‌రం
ప్రియాంక జ‌వాల్క‌ర్
సాయికుమార్
తులసి శివమణి
అరుణ్ కుమార్
అనిల్ జీలా
కష్యప్ శ్రీనివాస్

టెక్నీష‌న్స్

సంగీతం - చేతన్ భరద్వాజ్
కెమెరామెన్ - విశ్వాస్ డేనియల్
నిర్మాత‌లు - రాజు, ప్ర‌మోద్
ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే‌

Facebook Comments

%d bloggers like this: