Social News XYZ     

SAVE THE WORLD | Special Song | KOTI | Roshan Salur | [HD] (Video)

         Composed & Sung by:

KOTI

Keyboard Programmed & Arranged:
ROSHAN SALUR

Final Mixing & Mastering:
ROSHAN SALUR

 

Synthesizer:
SAMARTH GOLLAPUDI

Lyrics:
SRINIVASA MOULI

Editing:
SAI TIMMISETTY

DOP:
VENKAT TAMMANA

Visual Direction:
MAHESH & RAJEEV

LYRICS:

ప్రశాంతత , పంచ భూతాల్లో దశ దిశల్లో ఎంతో ప్రశాంతత.
పసి పిల్లల నిర్మలమైన నవ్వులా ప్రకృతి ఉండేది, ఆన్ని జీవాల్ని అమ్మలా సాకేది.
అనుభూతులు అనే రుచులు బోలెడు దొరికేవి

మనిషిలోకి స్వార్థం మనసులో మలినం చేరుతున్న కొద్దీ, తన స్వార్థానికి ప్రకృతిని వాడుతున్న కొద్దీ , నిలబడ్డ అడుగు నుంచి అంతరిక్షం వరకు అంతా కలుషితం ఐపోయింది. మనిషి తన సాటి వారిపైనే అమానుషాలకు దిగేంతటి నీచానికి దిగజారిపోయాడు. బ్రతుకొక రణమైంది.

పల్లవి:   ఏమిటి నీ సమాధానం ఏమిటి నీ సమాధానం
వినాశనం అన్నది ప్రకృతి, వినలేదా?
భావితరం బాధ్యత నీదని మరిచావా
ఏమిటి నీ సమాధానం , చాలదుగా ఈ మౌనం
రక్తసిక్తమేకదా నీ చరిత్ర సంతకం
ఎక్కడుంది శాంతి సంకేతం
నిన్నుకన్న భూమి కంట రక్త ధార
నువ్వు తాగి చీల్చగా స్తన్యం ||ఏమిటి నీ సమాధానం ఏమిటి నీ సమాధానం||

చరణం: ఎవ్వరిది ఎవ్వరిది ఈ పుడమి ఎవరిది తెలుసుకో
మనిషికి మాత్రమే సొంతము కాదుకదా
ఎందుకిలా ఎందుకిలా ఇంతింత స్వార్ధము మనసులో
హద్దులు దాటితే ఒక్కడు మిగలడుగా
ప్రతి ఒక జీవికిలా నువు శాపము
ఆగక సాగె మారణ హోమము
అడవికి గండము నదులకు గండము
జగతికె గండమురా
కరిగెను హిమములు కడలీ పొంగెను
అరెరరె నువు కను తెరవవెరా?
పీల్చే గాలి విషమయే నీరూ గరళమెరా
అసలంటు మానవాళి ఉనికిని చెరపకురా
తెలివంటూ ఉంటే ఇప్పుడైనా మారరా! ||ఏమిటి నీ సమాధానం ఏమిటి నీ సమాధానం||

ఏమిటి మీ సమాధానం - స్వార్థాన్ని చెరిపి సాగుదాం
ఏమిటి మీ సమాధానం - శాంతిని లోకాన నిలుపుదాం
ఏమిటి మీ సమాధానం - మనుషులు ఒకటంటు చాటుదాం
ఏమిటి మీ సమాధానం - ప్రకృతిలో ఒదిగి బతుకుదాం
ఏమిటి మీ సమాధానం - కరుణను కణకణము నింపుదాం
ఏమిటి మీ సమాధానం - అసమానతలన్నీ చెరుపుదాం
ఏమిటి మీ సమాధానం - ఇన్నాళ్ళ తప్పు చెరుపుదాం
ఏమిటి మీ సమాధానం - స్వర్గంగా ఇలను మార్చుదాం

అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయమృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతిః శాంతిః శాంతిః

Facebook Comments
SAVE THE WORLD | Special Song | KOTI | Roshan Salur | [HD] (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
SAVE THE WORLD | Special Song | KOTI | Roshan Salur | [HD] (Video)
Description

Composed & Sung by: KOTI Keyboard Programmed & Arranged: ROSHAN SALUR Final Mixing & Mastering: ROSHAN SALUR Synthesizer: SAMARTH GOLLAPUDI Lyrics: SRINIVASA MOULI Editing: SAI TIMMISETTY DOP: VENKAT TAMMANA Visual Direction: MAHESH & RAJEEV LYRICS: ప్రశాంతత , పంచ భూతాల్లో దశ దిశల్లో ఎంతో ప్రశాంతత. పసి పిల్లల నిర్మలమైన నవ్వులా ప్రకృతి ఉండేది, ఆన్ని జీవాల్ని అమ్మలా సాకేది. అనుభూతులు అనే రుచులు బోలెడు దొరికేవి మనిషిలోకి స్వార్థం మనసులో మలినం చేరుతున్న కొద్దీ, తన స్వార్థానికి ప్రకృతిని వాడుతున్న కొద్దీ , నిలబడ్డ అడుగు నుంచి అంతరిక్షం వరకు అంతా కలుషితం ఐపోయింది. మనిషి తన సాటి వారిపైనే అమానుషాలకు దిగేంతటి నీచానికి దిగజారిపోయాడు. బ్రతుకొక రణమైంది. పల్లవి:   ఏమిటి నీ సమాధానం ఏమిటి నీ సమాధానం వినాశనం అన్నది ప్రకృతి, వినలేదా? భావితరం బాధ్యత నీదని మరిచావా ఏమిటి నీ సమాధానం , చాలదుగా ఈ మౌనం రక్తసిక్తమేకదా నీ చరిత్ర సంతకం ఎక్కడుంది శాంతి సంకేతం నిన్నుకన్న భూమి కంట రక్త ధార నువ్వు తాగి చీల్చగా స్తన్యం ||ఏమిటి నీ సమాధానం ఏమిటి నీ సమాధానం|| చరణం: ఎవ్వరిది ఎవ్వరిది ఈ పుడమి ఎవరిది తెలుసుకో మనిషికి మాత్రమే సొంతము కాదుకదా ఎందుకిలా ఎందుకిలా ఇంతింత స్వార్ధము మనసులో హద్దులు దాటితే ఒక్కడు మిగలడుగా ప్రతి ఒక జీవికిలా నువు శాపము ఆగక సాగె మారణ హోమము అడవికి గండము నదులకు గండము జగతికె గండమురా కరిగెను హిమములు కడలీ పొంగెను అరెరరె నువు కను తెరవవెరా? పీల్చే గాలి విషమయే నీరూ గరళమెరా అసలంటు మానవాళి ఉనికిని చెరపకురా తెలివంటూ ఉంటే ఇప్పుడైనా మారరా! ||ఏమిటి నీ సమాధానం ఏమిటి నీ సమాధానం|| ఏమిటి మీ సమాధానం - స్వార్థాన్ని చెరిపి సాగుదాం ఏమిటి మీ సమాధానం - శాంతిని లోకాన నిలుపుదాం ఏమిటి మీ సమాధానం - మనుషులు ఒకటంటు చాటుదాం ఏమిటి మీ సమాధానం - ప్రకృతిలో ఒదిగి బతుకుదాం ఏమిటి మీ సమాధానం - కరుణను కణకణము నింపుదాం ఏమిటి మీ సమాధానం - అసమానతలన్నీ చెరుపుదాం ఏమిటి మీ సమాధానం - ఇన్నాళ్ళ తప్పు చెరుపుదాం ఏమిటి మీ సమాధానం - స్వర్గంగా ఇలను మార్చుదాం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయమృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతిః శాంతిః శాంతిః

%d bloggers like this: