Social News XYZ     

Director Narra Siva Nageswara Rao SeeksK Viswanath’s Blessings For His Annapurnamma Gari Manavadu Movie

దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్ ఆశీస్సులు

గతంలో పలు చిత్రాలు చేసిన దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) తాజాగా రూపొందించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. టైటిల్ పాత్రలలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా...ప్రముఖ నటి జమున ఓ కీలక పాత్ర పోషించారు. ఎమ్మెన్నార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ పట్ల తనకు గల అభిమానాన్నిదర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు చాటుకుంటూ హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ గారి మనవడు పోస్టర్స్ ను తిలకించిన కె.విశ్వనాద్ ఆ చిత్ర విశేషాలను శివనాగును ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

 

అందరికీ సుపరిచితమైన పలువురు ప్రముఖ ఆర్టిస్టులు నటించిన....పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం విజయవంతం కావాలని కె. విశ్వనాద్ ఆకాంక్షించారు. ఇంకా షూటింగ్ చేసిన లొకేషన్స్ ను వాకబు చేసిన ఆయన అమరావతి పరిసర ప్రాంతాలలో తీశామని చెప్పగానే... ఒకప్పుడు తాను రూపొందించిన సప్తపది చిత్రాన్ని అదే సమయంలో గుర్తు చేసుకున్నారు.

Facebook Comments