Social News XYZ     

Megastar Chiranjeevi Will Be Chief Guest For O Pitta Katha Movie Pre Release Event

భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో – కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్‌ ఫిల్మ్‌ ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌ కానుంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ –‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.

నటీనటులు:

 

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి.

సాంకేతిక నిపుణులు:

పాటలు: శ్రీజో , ఆర్ట్: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.

Facebook Comments