Social News XYZ     

Raja Sekhar’s Arjuna Movie Trailer Released

అర్జున ట్రైలర్ విడుదల

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి అందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా బుధవారం మధ్యాహ్నం ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నట్టికుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయంలో రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారు. సమకాలీన రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది .యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలిచారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.

 

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయకుమార్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: కన్మణి.

Facebook Comments