Social News XYZ     

Right Right Baggidi Gopal Movie Pre Release Event Will Be Held On Feb 23rd

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరున విడుదల కాబోతొంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్తూర్ జిల్లా, పుంగనూరులో చేయబోతున్నారు.

ఫిబ్రవరి 23న జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో శ్రీ ప్రహ్లద మోడీ దామోదర్ దాస్, డా.పి.రామచంద్ర రెడ్డి, శ్రీ సుమన్, శ్రీ కవిత, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, శ్రీ వై.సత్య కుమార్, శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి, శ్రీ చల్లపల్లి నరసింహారెడ్డి, శ్రీ ఎస్.ఎస్.విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొనబోతున్నారు.

ఈ సందర్భంగా బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ...
1982 లో మార్చి లో రాజకీయాల్లో జరిగిన కొన్ని కీలక మార్పులు జరిగాయి. అదే రోజు నేను ఎన్టీఆర్ తో పాటు నడవడం జరిగింది. తాను పెట్టిన టిడిపి పార్టీలో నేను చేసిన కృషి , సేవలు ఈ బగ్గిడి గోపాల్ చిత్రంలో చూపించడం జరిగింది. బస్ కండక్టర్ అయిన నన్ను అన్న గారు ఎలా ఎమ్మెల్యే చేసారు అనేది ఈ సినిమా మెయిన్ కథ. ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమా విడుదల కాబోతొంది. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఫిబ్రవరి 23న చెయ్యబోతున్నాము. ఈ సినిమాను స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి అంకితం చేస్తున్నాను. నా గురించి, నా జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు ఈ మూవీలో చెప్పడం జరిగింది, ఈ చిత్ర షూటింగ్ సమయంలో అందరూ బాగా సపోర్ట్ చేశారు, ముఖ్యంగా సుమన్ గారి సహాయ సహకారాలు మారువలేము, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

 

బ్యానర్: బగిడి ఆర్ట్ మూవీస్
సినిమా: బగిడి గోపాల్
ఆర్టిస్ట్స్: సుమన్, కవిత, ప్రభావతి, మహేష్, తేజ
హీరో: రమాకాంత్
హీరోయిన్: సిరి చందన
డైరెక్టర్: అర్జున్ కుమార్
ప్రొడ్యూసర్: బగిడి గోపాల్
కెమెరామెన్: ప్రవీణ్ కుమార్
స్టంట్స్ & కోడైరెక్టర్: అవిష్ పూరి
మ్యూజిక్: జయసూర్య బుప్పేం
పిఆర్ఓ: మధు.విఆర్

Facebook Comments