Social News XYZ     

‘Degree College’ Review: A youthful entertainer Rating: (***1/2)

'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)

చిత్రం: డిగ్రీ కాలేజ్
నటీనటులు : వరుణ్, దివ్యా రావు తదితరులు
దర్శకత్వం : నరసింహ నంది
నిర్మాత‌లు : శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా అండ్ టీమ్
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫర్ : ఎస్. మురళి మోహన్ రెడ్డి
ఎడిటర్ : వి నాగిరెడ్డి
రేటింగ్: 3.5/5

వరుణ్, దివ్యా రావు జంటగా దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన చిత్రం డిగ్రీ కాలేజ్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం

 

కథ:

శివ (వరుణ్) పార్వతి (దివ్యా రావు) ఒకే కాలేజీలో చదువుకుంటారు. పేదవాడైన తక్కువ వర్గానికి చెందిన శివ హోదా పలుకుబడి కలిగిన పోలీస్ అధికారి కూతురు పార్వతిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన పార్వతి తండ్రి వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. దీనితో శివ పార్వతి లేచి పోయి పెళ్లి చేసుకుంటారు. దీనితో రగిలిపోయిన పార్వతి తండ్రి తీవ్రంగా వెతికి కూతురు పార్వతిని పట్టుకొస్తాడు. మరి శివ మళ్ళీ ఆమెను కలిశాడా? పార్వతి తండ్రి మనసు మారిందా? వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.

విశ్లేషణ:

ఈ చిత్రంలో హీరోయిన్ దివ్యా రావ్ నటన స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అని చెప్పాలి. తెలంగాణా స్లాంగ్ లో ఆమె డైలాగ్స్ తోపాటు, బోల్డ్ ఇంటిమసీ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. దివ్యా రావ్ పార్వతి పాత్రలో చాల క్యూట్ గా ఉన్నారు. ఇక హీరో వరుణ్ నటనలో పర్వాలేదు అనిపించారు. ఆయన నటన పరంగా ఇంకొంత పరిపక్వత సాధించాలని అనిపిస్తుంది.

సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ మరియు ఇంటిమసీ సాంగ్ ఆహ్లాదం కలిగించాయి.

బాడ్ పోలీస్ అధికారిగా హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన నటుడు, అలాగే హీరో హీరోయిన్ స్నేహితుల పాత్రలు చేసిన వారు ఆకట్టుకున్నారు.
పేద ధనిక వర్గాల మధ్య ప్రేమ, దీనివలన ఎదురయ్యే సమస్యలు అనే ఆసక్తికరమైన పాయింట్ తీసుకున్నటికీ ఇదివరకే అనేక సినిమాలు ఇదే పాయింట్ పై రావడంతో కొత్తగా ఏమి అనిపించదు. ఆయన ఈ సినిమాకు రాసుకున్న స్క్రీన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా అండ్ టీమ్ బాగా ఖర్చు పెట్టి సినిమా తీశారు. సునీల్ కశ్యప్ సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన బీజీఎమ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వి నాగిరెడ్డి ఎడిటింగ్, మురళి మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.

సొసైటీ లో ధనిక పేద వర్గాల మధ్య అంతరాలు వంటి సోషల్ కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు తన కథనంతో ప్రేక్షకులను రంజింపచెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. దివ్యా రావ్ నటన, హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు. కథలో ట్విస్టులు బాగున్నాయి.

చివరిగా: డిగ్రీ కాలేజ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

 

Facebook Comments
'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)

About SR

Summary
'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)
Review Date
Reviewed Item
Degree College
Author Rating
4'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)'Degree College' Review: A youthful entertainer Rating: (***1/2)
Title
Degree College
Description
వరుణ్, దివ్యా రావు జంటగా దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన చిత్రం డిగ్రీ కాలేజ్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం
Upload Date
February 7, 2020
%d bloggers like this: