Social News XYZ     

Photos: Minister Talasani Srinivas Yadav Meets Chiranjeevi And Nagarjuna To Discuss Movie Industry Development

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం జూబ్లీహిల్స్ లోని సినీనటుడు శ్రీ చిరంజీవి నివాసంలో నటులు శ్రీ చిరంజీవి, శ్రీ నాగార్జున లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చలనచిత్ర పరిశ్రమ కు సంబంధించి పలు అంశాలను చర్చించినారు.

ప్రధానంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు, ఇతర నగరాలలో కంటే దీటుగా సినిమా షూటింగ్ లకు శంషాబాద్ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్ నైపుణ్యంను మరింత పెంపొందింప చేసేందుకు ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరించారు. టికెట్ల ధరల సరళీకృత విధానం పాటించాలని పేర్కొన్నారు. చిత్రపురి కాలనీ పక్కనే సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రస్తావించారు.

సినీ కార్మికులు, కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు. అదేవిధంగా సినీ, tv కళాకారులకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులను అందజేయాలని, సినీ అవార్డుల ప్రధానం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు వర్తింపచేయాలని, Esi సౌకర్యం కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని ప్రతిపాదించారు. సినిమా షూటింగ్ కు ముందే ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో రిజిస్టర్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.

 

చిత్రపురి కాలనీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో హాస్పిటల్, స్కూల్ నిర్మాణానికి ధాతలు ముందుకు వస్తే దాతల పేరుతోనే నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో చిత్రపురి కాలనీలో త్రాగునీరు, రోడ్లు, బస్సు సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే అనీక పర్యాయాలు సినీ ప్రముఖులు, చిత్రపురి కాలనీ సభ్యులతో సమావేశమై పలు సమస్యలను తెలుసుకోన్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 2 వ వారంలో సినేరంగ ప్రముఖులు, సంబందిత అధికారులతో సమావేశం కావాలని ఈ సమావేశంలో ఇంకా అనేక సమస్యలపై కూలంకషంగా చర్చించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో FDC మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, నిర్మాత నిరంజన్ రెడ్డి, FDC ED కిషోర్ బాబు తదితరులు ఉన్నారు.

Facebook Comments