Social News XYZ     

Upasana Konidela Reminds Rama Chiluka Psittacula Krameri Is AP State Board And Caging Birds Is Illegal

రామచిలుక పై ఉపాసన కరుణ

రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. దాని అందం గులాబీ రంగు లో ఉండే దాని ముక్కు లోనే ఉంటుంది. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఇలాంటి వన్యప్రాణుల సంరక్షణ కు ఆమె నడుం కట్టిన సంగతి తెలిసిందే.

రామచిలుక ను పంజరంలో బంధిస్తే 5000 జరిమానా పడుతుందని, ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. రామచిలుక ఎగరడానికి పుట్టింది కానీ మీరు జాతకాలు చెప్పించుకోడానికో, మీకు వినోదాన్ని అందించడానికో కాదు. అందుకే పంజరంలోని రామచిలుక ను బయటకు వదిలేలా చూడండి, అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి అని ఆమె పేర్కొన్నారు.

 

Facebook Comments

%d bloggers like this: