Social News XYZ     

Suman And Sayaji Shinde Starrer Satyam Movie Completes First Schedule

శ్రీమాతా క్రియేషన్స్ సుమన్, షియాజి షిండే ముఖ్య పాత్రల్లో వస్తోన్న సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి !!!Suman And Sayaji Shinde Starrer Satyam Movie Completes First Schedule
శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.

Facebook Comments
Suman And Sayaji Shinde Starrer Satyam Movie Completes First Schedule

About SR