Social News XYZ     

Prabhu Deva’s Krishna Manohar IPS movie is releasing on Feb 7th

ఫిబ్రవరి 7న వస్తున్న 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్'

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడిగా అలరారుతున్న ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రభుదేవా తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను.. పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 7 న ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రభుదేవా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో.. 'అల వైకుంఠపురములో' ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా.. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని, ఈ నెలాఖరుకు ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరి 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు.

 

ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్!!

Facebook Comments
Prabhu Deva's Krishna Manohar IPS movie is releasing on Feb 7th

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: