Social News XYZ     

Sayyad Hussain Trilingual Movie On Pune Gangster Bala Shahed Chowdary Shivaji

సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో
బాలా సాహెబ్ చౌదరి (శివాజీ) బయోపిక్

'పైసా పొట్టి ప్రాబ్లెమ్, దావత్ ఏ షాదీ, సలాం జిందగీ' చిత్రాలతో రైటర్ కమ్ డైరెక్టర్ గా తిరుగులేని పేరు సంపాదించుకున్నారు యువ ప్రతిభాశాలి సయ్యద్ హుస్సేన్. డెక్కన్ వుడ్ లో బ్లాక్ బస్టర్స్ గా డిక్లేర్ అయిన ఈ మూడు చిత్రాలు ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'రాజశ్రీ ప్రొడక్షన్స్' ద్వారా విడుదలై బాలీవుడ్ వర్గాల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించాయి. అంతే కాదు బాలీవుడ్ లో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు అవకాశాలను సైతం తెచ్చిపెట్టాయి. వాటిలో ఒక చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ కు వెళ్లనుంది.

పూణెకి చెందిన ప్రముఖ గ్యాంగ్ స్టర్ బాలా సాహెబ్ చౌదరి అలియాస్ శివాజీ కల్పిత బయోపిక్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ యువ కథానాయకుడు రణదీప్ హుడా టైటిల్ రోల్ పోషించే అవకాశముంది. హిందీతోపాటు మరాఠీ మరియు తెలుగు భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో తెరకెక్కనుంది. అమెరికా సిటిజెన్ అయిన ఊరూసా రహీమ్ ఈ త్రిభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సయ్యద్ హుస్సేన్ దర్శకత్వం వహించిన సలామ్ జిందగీ చిత్రాన్ని ఉరూసా రహీమ్ నిర్మించడంతోపాటు ఆ చిత్రానికి కో డైరెక్టర్ గానూ వ్యవహరించారు. పలు ప్రముఖ ప్రోడక్ట్స్ కి యాడ్ ఫిలిమ్స్ రూపొందించి.. ఆ రంగంలోనూ తన సత్తా చాటుకున్న సయ్యద్ హుస్సేన్ 'నౌబార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్' ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారు. ఉరూసా రహీమ్ ఈ సంస్థకు కో ఫౌండర్. ఈ ఏడాది చికాగోలో 'నౌబార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించేందుకు సయ్యద్ హుస్సేన్, ఉరూసా రహీమ్ సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నారు.

 

పూణే గ్యాంగ్ స్టర్ బాలా సాహెబ్ చౌదరి అలియాస్ శివాజీ బయోపిక్ గురించి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ముంబైలో బాల్ థాకరే ఎంత పాపులరో.. పూణేలో బాలా సాహిద్ చౌదరి అలియాస్ శివాజీ అంత పాపులర్. కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ గా పేరు పడ్డ సాహెబ్ చౌదరి జీవితం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన తనయుడు ఐ.పీ.ఎస్ ఆఫీసర్ కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. ఈ చిత్రాన్ని హిందీ, మరాఠీ భాషలతోపాటు తెలుగులోనూ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంతోపాటు మరో బాలీవుడ్ చిత్రానికి కూడా సైన్ చేశాను. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే తెలుగులోనూ ఒక మంచి సినిమా చేయాలని నా కోరిక.. అన్నారు!!

Facebook Comments

%d bloggers like this: