Social News XYZ     

One Shot Two Birds Is The Concept Of 2 Plus 1 Movie

ఒక్క దెబ్బకు రెండు పాలపిట్టలు అదే '2+1'

టు ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ - ఈ సూత్రం ఏదో బాగానే ఉంది కదూ! సూత్రం ఏదైనా మంగళసూత్రం కడితేనే కదా కథ ఓ కొలిక్కి వచ్చేది... అప్పటిదాకా చెట్టవెంట, పుట్ల వెంట పరుగులు పెట్టడమే. ఒక్క ఒరలో రెండు కత్తులు ఎలాగూ ఇమడవు... అలాంటప్పుడు రెండు పాలపిట్టలు ఒకదానితో ఒకటి ప్రేమపోటీ పడితే ఉక్కబోత పెరగక ఏమవుతుంది? ఇలాంటి ట్రయాంగిల్ ప్రేమ పండాలంటే అందులో మాస్ మసాలా కూడా దట్టంగా ఉండాలి. హీరో షకలక శంకర్ తో ప్రేమ పోటీలో పడిన రెండు పాటపిట్లలు ఎట్టా బయటపడ్డాయోగాని పాటల పందెంలో మాత్రం ఢీ అంటే ఢీ అన్నాయి. భాస్కరభట్ల రవికుమార్ అనే మాస్ మసాలా చేరబట్టే ‘ఒక్క దెబ్బకు రెండు పాలపిట్టలు’ పాట పుట్టింది. సంగీత దర్శకుడు హరిగౌర రకల్పనలో
రూపుదిద్దుకుంటున్న ఈపాట మ్యూజిక్ సిట్టింగ్ లో భాస్కరభట్ల, సంగీత దర్శకుడు హరిగౌరలతోపాటు నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి, దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి పాలుపంచుకున్నారు.

‘ఒక్క దెబ్బకు రెండు పాలపిట్టలు
ఒక్క ఒరలో రెండు వేట కత్తులు
ఒక్కసారే ఉక్కపోత పెంచాయే...
ఒక్క తాడుకు రెండు బొంగరాలు
ఒక్క వేలికి రెండు ఉంగరాలు
ఒక్కసారే కితకితలెట్టాయే...
నీకేది ఇమ్మన్నా ఇచ్చేసుకుంటాలే
సరస్సులాంటి వయస్సునన్నే చుట్టుముట్టి చంపుతుందే
అందులోనా కొట్టుకు వెళ్లిపోనా.. అందమైనా ఒడ్డును వెతికెయ్యనా’

 

... ఇలా సాగిపోయింది ఈ మాస్ పాట. ఈ పాట గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ ఈ సినిమా కథలో సన్నివేశానికి తగ్గట్టుగా పాట ఉండాలంటే భాస్కరభట్ల అయితే న్యాయం చేయగలరని ఆయనతో ఈ పాట రాయించామన్నారు. తాను అనుకున్నదానికన్నా ఎంతో బాగా పాట వచ్చిందన్నారు. ఇప్పటిదాకా భాస్కరభట్ల రాసిన మాస్ పాటల వరుసలో ఇది ముందు
వరుసలో చేరే పాట అవుతుందని అన్నారు. హీరో శంకర్ కూడా ఈ పాట విని ‘శభాష్’ అని ప్రశంసించినట్లు చెప్పారు. దర్శకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేటి ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ పాటను రాయించినట్లు చెప్పారు. షకలక శంకర్ కెరీర్ ను మలుపుతిప్పేలా ఈ పాట ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో నిర్మాత ఎడవెల్లి వెంకట రెడ్డి. ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో ప్రారంభమవుతుంది. మ్యూజికల్ లవ్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోంది.

Facebook Comments

%d bloggers like this: