Social News XYZ     

Mammootty’s Mamangam Telugu Trailer Launch Will Be Held On Dec 3rd At 10 AM

డిసెంబర్ 3న సూపర్ స్టార్ మమ్ముట్టి మామాంగం ట్రైలర్ విడుదల

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం' మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మాత్రం సర్ ప్రైజ్. ఈ లేడీ గెటప్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 3న ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..... "1695వ సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారూ. మామాంగం` చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 3న, చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం " అని తెలిపారు.

 

తారాగణం:
మమ్ముట్టి,ప్రాచి తెహెలన్,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్,అభిరాం అయ్యర్ తదితరులు

సాంకేతిక బృందం :
డైరెక్టర్: ఎం. పద్మకుమార్
ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ,
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్
డైలాగ్స్ : కిరణ్
డి.ఓ.పి: మనోజ్ పిళ్ళై
యాక్షన్: శామ్ కౌశల్
వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్
ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్
ఎడిటర్: రాజా మొహమ్మద్
మ్యూజిక్: ఎం. జయచంద్రన్
బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Facebook Comments