Social News XYZ     

RGV’s Beautiful Movie To Release on December 6th

డిసెంబర్ 6 న బ్యూటిఫుల్ విడుదల

RGV's Beautiful Movie To Release on December 6th

Hyderabad: Stills from Telugu film "Beautiful" in Hyderabad. (Photo: IANS)

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 6 న విడుదల కానుంది.

 

ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ... ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి, మొదటి సింగల్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి అని తెలిపింది.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

 

Facebook Comments