Social News XYZ     

Nireekshana promotional song Raakshasa gets good response

నిరీక్షణ' ప్రమోషనల్‌ సాంగ్‌ 'రాక్షస..'కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

Nireekshana promotional song Raakshasa gets good response

Nireekshana promotional song Raakshasa gets good response (Photo:SocialNews.XYZ)

సాయిరోనక్‌, ఎనా సహా జంటగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీక ష్ణ మళ్ళ దర్శకత్వంలో పి.రాజన్‌ నిర్మిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'నిరీక్షణ'. ఈ చిత్రంలో మొదటిసారి ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు ప్రమోషనల్‌ సాంగ్‌ 'రాక్షస..' విడుదల చేశారు. 'రాక్షస..' సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ ''మా సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ 'రాక్షస..'కు చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా చాలా అద్భుతమైన క్యారెక్టర్‌ చేశారు. హీరోహీరోయిన్లు సాయిరోనక్‌, ఎనా సహా కూడా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు'' అన్నారు.

సాయి రోనక్‌, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి వి., సంగీతం: మంత్ర ఆనంద్‌, పాటలు: చంద్రబోస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాణం: టేక్‌ ఓకే క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ.

Facebook Comments