ప్రతిరోజు పండగే అంటూ... దీపావళి సంబరాలు చేసుకున్న సాయి తేజ్, మారుతి, రాశిఖన్నా

Sai Dharam Tej, Raashi Khanna & Maruthi of Prathi Roju Pandage Team Celebrate Diwali (Photo:SocialNews.XYZ)
సుప్రీమ్ హీరో సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు ముచ్చటగా ఉన్నాయి. తాత & మనవడు మధ్య రిలేషన్ ను ఈ సినిమాలో అందంగా చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.
GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో, నిర్మాత బన్నీవాస్ సారధ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. సాయితేజ్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రతిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైన ప్రముఖ నటులు సత్యరాజ్ క్యారెక్టర్ ని ఈ సినిమా దర్శకులు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో నటిస్తున్న మరో నటుడు రావు రమేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండనుంది.
నటీనటులు:
సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు
సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం – మారుతి సమర్పణ – అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ – బన్నీ వాస్ కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్ మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్ ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి) ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు డిఓపి – జయ కుమార్ పీఆర్ఓ – ఏలూరు శ్రీను పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను