Social News XYZ     

Naga Shaurya & Ira Creations Production No 3 is an action-oriented film

యాక్ష‌న్ నేప‌థ్యంతో నాగ శౌర్య‌, ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 3

Naga Shaurya & Ira Creations Production No 3 is an action-oriented film

Naga Shaurya & Ira Creations Production No 3 is an action-oriented film (Photo:SocialNews.XYZ)

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు.

 

ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఓ యాక్ష‌న్ సీన్ ని షూట్ చేస్తుండ‌గా నాగ‌శౌర్య కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకుండానే నాగ‌శౌర్య మ‌ళ్లీ షూట్ లోకి జాయిన్ అవ్వ‌డం జ‌రిగింది. అన్బుఅరివు మాస్ట‌ర్స్ కి తెలుగులో ఇది మొద‌టి సినిమా కావ‌డంతో, యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నార‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు. ఇక అలానే ఈ సినిమాలో క‌ట్ లేకుండా ఉండే 3 నిమిషాల నిడివిగ‌ల స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రిస్తున్నామ‌ని,ఇవి ప్రేక్ష‌కుల‌కి ఓ స‌రికొత్త అనుభూతిని ఇస్తాయ‌ని యూనిట్ సభ్యులు తెలిపారు.

న‌టీన‌ట‌లు..
పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్

సాంకేతిక వ‌ర్గం
మ్యూజిక్ః శ్రీ‌చ‌ర‌ణ్‌,
కెమెరాః మ‌నోజ్‌రెడ్డి,
ఎడిట‌ర్ : ‌గారీబిహెచ్‌,
ఆర్ట్‌డైరెక్ట‌ర్ః కిర‌ణ్‌కుమార్ మ‌న్నే,
కొరియోగ్రాఫర్ః ర‌ఘుమాస్ట‌ర్‌,
ఫైట్స్.. అన్బు అరివు
స్టోరీః నాగ‌శౌర్య‌,
స్ర్కీన్‌ప్లేఃర‌మ‌ణతేజ‌, ఫ‌ణీంద్ర‌బిక్కిన‌,
డైరెక్ష‌న్ఃర‌మ‌ణ్‌తేజ‌,
ప్రొడ్యూస‌ర్ఃఉషాముల్పూరి,
పిఆర్ ఓః ఏలూరుశ్రీ‌ను.

Facebook Comments