Social News XYZ     

We are happy with Dear Comrade: Producers

We are happy with Dear Comrade: Producers

We are happy with Dear Comrade: Producers (Photo:SocialNews.XYZ)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కకుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈనెల 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా నిర్మాతలు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాని 21 దక్కింది. గ్రాస్ లో చూసుకుంటే 30 కోట్లవరకు రాబట్టింది. హీరో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్ సీస్ లో కూడా భారీ కలక్షన్స్ అందుకున్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం .. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే కలక్షన్స్ రావడం, బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లో గా ఉందంటూ కామెంట్స్ రావడమతొ 30 నిమిషాల సినిమాను కట్ చేసాం. అలాగే ఇప్పటికే ఇందిలో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు,చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటినుండి ఆ సాంగ్ ని జోడించాం. ఆ పాట సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం అన్నారు.

 

మరో నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ - ``రెస్పాన్స్ చాలా హ్యూజ్‌గా ఉంది. యు.ఎస్‌. , యు.కె ల్లో మంచి క‌లెక్ష‌న్స్ ఉన్నాయ‌ని ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను పెళ్లి చూపులు తరువాత విజయ్ విని నాకు వినిపించాడు అప్పటికి అర్జున్ రెడ్డి రాలేదు .. ఆ తరువాత సినిమా మొదలు పెట్టాం. అర్జున్ రెడ్డి పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో ఏ మార్పులు చేయలేదు కానీ .. అనుకునం. అప్పుడే మైత్రి నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. వారివల్ల సినిమా రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మంచి వసూళ్లు అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.

నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ .. కలక్షన్స్ బాగున్నాయి. వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ బాగుంది. ముక్యంగా తెలుగు సినిమాను మలయాళంలో బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళ్, కన్నడ కూడా బాగా ఆడుతుంది. ఈ సినిమా తరువాత విజయ్ హీరోగా చేస్తున్న హీరో సినిమా మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాం అన్నారు.

Facebook Comments

%d bloggers like this: