Social News XYZ     

Rakshasudu movie in post-production work, Grand release on July 18th

శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుటున్న `రాక్ష‌సుడు`... అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై జూలై 18న గ్రాండ్ రిలీజ్

Rakshasudu movie in post-production work, Grand release on July 18th

Rakshasudu movie in post-production work, Grand release on July 18th (Photo:SocialNews.XYZ)

బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం రాక్ష‌సుడు. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హ‌వీశ్ ప్రొడ‌క్ష‌న్‌లో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

 

నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ఫిబ్ర‌వ‌రి 21న మొద‌లైన `రాక్ష‌సుడు` చిత్రం కంటిన్యూగా 85రోజులు.. 110 కాల్ షీట్స్తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడే ర‌ష్ చూశాను. అద్భుతంగా వ‌చ్చింది. సినిమాను మొద‌లు పెట్టిన‌రోజు నుండే ఓ మంచి సినిమా చేస్తున్నామ‌నే ఫీలింగ్ ఉంది. ఈరోజు సినిమా ర‌ష్ చూశాక‌, ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తీశాం అని న‌మ్మ‌కంగా ఉంది అన్నారు. డ‌బ్బింగ్ దాదాపు పూర్తి కానుంది. జిబ్రాన్ రీరికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సింక్ సినిమా వాళ్లు సౌండ్ డిజైన్ చేస్తుండ‌గా.. ప్రైమ్ ఫోక‌స్‌లో డి.ఐ జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి అభిషేక్ ఫిలింస్ ద్వ‌రాఆ సినిమాను జూలై 18న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ మాట్లాడుతూ - నాకు అకాశం ఇచ్చిన నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ‌గారికి థాంక్స్‌. మంచి టీం కుదిరింది. ఈ సినిమా కోసం క‌ష్ట‌డప‌డినా ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌ అన్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.

Facebook Comments