Social News XYZ     

Haranath Policherla’s ‘Captain Rana Pratap’ Movie Audio Lunched

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఆడియో విడుదల

Haranath Policherla's 'Captain Rana Pratap' Movie Audio Lunched

Haranath Policherla’s ‘Captain Rana Pratap’ Movie Audio Lunched (Photo:SocialNews.XYZ)

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం కెప్టెన్ రాణాప్ర‌తాప్‌. ఎ జ‌వాన్ స్టోరి క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను సీనియర్ హీరో సుమన్, బిగ్ ఆడియో సీడీని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా

 

అమ‌ర్ నాథ్ మాట్లాడుతూ - సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమాలో నా వంతు స‌హకారాన్ని అందించాను అన్నారు.

హీరోయిన్ నిషి మాట్లాడుతూ - చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. హ‌రినాథ్‌గారికి థాంక్స్‌. తెలుగులో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. ఇక్క‌డ మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ - హ‌రినాథ్‌గారు ఓ గ్రంథం. ఓ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌, రైట‌ర్‌, ఆర్టిస్ట్.. ఇలా అన్నీ రంగాల్లో త‌న‌వంతు ప్ర‌తిభ ఉన్న న‌టుడాయ‌న‌. ఆయ‌న ఓ మంచి సినిమా చేయాల‌నుకోవ‌డం.. అందులో మేమందరం భాగం కావ‌డం ఆనందంగా ఉంది. సరిహ‌ద్దుల్లో సైనికులు త‌మ ప్రాణాల‌ను పణంగా పెట్టి కాపాడుతున్నారు. అలాంటి సైనికులు గురించి సినిమా తీయ‌డం గొప్ప విష‌యం. నేను డిఫ‌రెంట్ పాత్ర‌ను చేశాను అన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ..అమెరికాలో డాక్టర్ అయ్యికూడా మంచి మెస్సేజ్ ఉన్న సినిమాలను తీయాలనే ఉద్దేశ్యంతో దాదాపు 14 సినిమాలను చేసాడు డా. రఘు నాథ్. అందుకు అభినందించాల్సిన విషయమే.. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. నేను ఇందులో మేజర్ పాత్రలో నటించాను. చాలా పవర్ ఫుల్ పాత్ర అది. బోర్డర్ లోని ఆర్మి వాళ్ళ గురుంచి వారి గొప్పతనం గురుంచి చాలా గొప్పగా చూపించారు రఘు గారు. ఒకే వ్యక్తి డైరెక్ట్ చేసి, నటించి, నిర్మించడం అనే పనులు చేయడం చాలా కష్టం అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సినిమాను తెరకెక్కించారు ఆయన. ఈ కథ వినగానే డేట్స్ అడజస్ట్ చేసి మరీ సినిమాలో నటించాను నేను.. అంతలా నచ్చింది నాకు సినిమా. ఒక గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెప్పగలనని తెలిపారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. డా. రఘునాథ్ అమెరికాలో మంచి హస్త వాసి ఉన్న డాక్టర్ గా రోగాలను పొగిడితే.. ఈ సినిమాలో ఆర్మి కెప్టెన్ గా దేశాన్ని కాపాడే ఆఫీసర్ గా నటించాడు. మల్టిటాలెంట్ ఉన్న వ్యక్తి రఘు. సైనికుడి రియల్ లైఫ్ ను ఈ సినిమాలో చూపించారు. అందరికీ నచ్చేలా సినిమా కథను రూపొందించారని అర్థం అవుతోంది. సాంగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుతున్నా అన్నారు.

డా.హ‌రినాథ్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలు కెప్టెన్ రానా ప్రతాప్ స్టోరీ ని మలిచాను. అందుకు తగ్గట్టే క్యాస్టింగ్ కూడా కుదిరింది. అందరూ తమ తమ పాత్రల్లో జీవించారు. సైనికుడి లైఫ్ ను ఇందులో చూపించడం జరిగింది. సైనికులు లేకపోతే మనం లేము.. అనే కాన్సెప్ట్ తో కథ సాగుతుంది. వారికి ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది అది కూడా ఈ చిత్రంలో చూపించాము. చిత్రీకరణ బాగా జరిగింది. అందరికీ నచ్చే తీరులో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ 21 న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల, జ్యోతి రెడ్డి, వడ్లపల్లి కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

న‌టీన‌టులు:
హ‌రినాథ్ పొలిచెర్ల‌,సుమ‌న్‌,పునీత్ ఇస్సార్‌,షాయాజీ షిండే ,అమిత్‌,జ్యోతిరెడ్డి,నిషి,గిరి త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సాంకేతిక వ‌ర్గం :బ్యాన‌ర్‌: డ్రీమ్ టీమ్‌, మ్యూజిక్: చ‌ర‌ణ్‌-ష‌కీల్‌, కెమెరా: వ‌ంశీ ప్ర‌కాశ్‌, ఎడిట‌ర్‌:వెంక‌ట ర‌మ‌ణ‌, ఆర్ట్‌: గోవింద్‌,కాస్ట్యూమ్స్‌: జ‌న‌క ముని,క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ పొలిచెర్ల‌

Facebook Comments

%d bloggers like this: