Social News XYZ     

Shivaranjani Movie Special Song Released By Director Maruthi

సక్సెస్ పుల్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా శివరంజని సినిమాలో స్పెషల్ సాంగ్ ‘పాప్ కార్న్ ’ విడుదల

Shivaranjani Movie Special Song Released By Director Maruthi

Shivaranjani Movie Special Song Released By Director Maruthi (Photo:SocialNews.XYZ)

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ ఈ చిత్రంలోని ఒక హాట్ సాంగ్ ‘పాప్ కార్న్’సాంగ్ ను సక్సెస్ పుల్ డైరెక్టర్ మారుతి లాంచ్ చేసారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు మారుతి గారు మాట్లాడుతూ.. ‘‘ ఇంతకు ముందు శివరంజని ట్రైలర్ చూసాను చాలా బాగుంది. హార్రర్ బ్యాక్ డ్రాప్ అనగానే తక్కువ బడ్జెట్ సినిమా అనుకుంటారు. కానీ ఈ సినిమా చాలా రిచ్ గా తీసారు అనిపించింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం నాకు నచ్చింది. నిర్మాత పద్మనాభరెడ్డి గారు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత,చిన్న సినిమాలకు ఆయన అందిస్తున్న సహాకారం చాలా పెద్దది. ఆయనకు ఈ సినిమా మంచి పేరుతో పాటు లాభాల్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను లాంచ్ చేసిన పాప్ కార్న్ పాట కూడా చాలా ఎంటర్ టైనింగ్ ఉంది. తప్పకుండా శివరంజని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఇక దర్శకుడు నాగప్రభాకరన్ చిత్ర కంటెంట్ ను గురించి తెలియజేస్తూ.. ‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే కథ ఇదని చెప్పారు. స్ర్కీన్ ప్లే బేసెడ్ గా ఈ కథ నడుస్తుంది. రష్మి క్యారెక్టర్ లోని వేరియేషన్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. ఊహించని కథ, కథనాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. నిర్మాత పద్మనాభరెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తిచేసుకొని సెన్సార్ కి రెడీ అవుతుంది. అలాగే మేం అడగ్గానే వచ్చి మా సినిమా లోని స్పెషల్ సాంగ్ ని లాంచ్ చేసిన మారుతి గారికి కృతజ్ఞతలు తెలిజయచేసుకుంటున్నాను’’ అన్నారు..

నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ దర్శకులు మారుతి చేతులు మీదుగా మాసినిమా స్పెషల్ సాంగ్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. హార్రర్ సినిమాలలో శివరంజని విభిన్నంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే నమ్మకం మాకుంది. పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. తర్వలోనే సెన్సారుకు వెళుతుంది. ఈనెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.

మరోనిర్మాత నల్లా అయ్యన్ననాయుడు, సహానిర్మాత కటకం వాసు మాట్లాడుతూ: ‘‘యు అండ్ ఐ బ్యానర్ లో వస్తున్న శివరంజని మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ని లాంచ్ చేసిన మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జూన్ నెలలో గ్రాండ్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ మూవీ శివరంజనిలో నందు, రష్మి గౌతమ్ జంటగా నటిస్తుండగా నందినీరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర పాత్రల్లో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి, నటిస్తున్నారు.యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ : నల్లాస్వామి, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహనిర్మాత : కటకం వాసు, నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, దర్శకత్వం : నాగ ప్రభాకరన్.

Facebook Comments