జూన్ 8నుండి వైజాగ్ లో నాగశౌర్య - ఐరా క్రియేషన్స్ చిత్రం రెండవ షెడ్యూల్

Naga Shaurya – Ira Creations movie second schedule begins from June 8th in Vizag (Photo:SocialNews.XYZ)
నిర్మాతలు మాట్లాడుతూ.. ఛలో లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని చాలా నిజాయితిగా నిర్మించాము. అంతే నిజాయితిగా అఖండ విజయం అందించారు మా బ్యానర్ లో చిత్రాలు అన్ని ప్రేక్షకుడు ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాము... ఛలో మంచి ప్రేమకథ, నర్తనశాల మంచి కామెడి చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే విధంగా నాగశౌర్య నటించే ప్రోడక్షన్ నెం 3 చిత్రం షూటింగ్ మెదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ 8 నుండి విశాఖపట్నం లోని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. హీరో నాగశౌర్య రాసిన కథకి దర్శకుడు రమణతేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థవంతంగా షూట్ చేస్తున్నాడు. మెహరిన్ హీరోయిన్ గా మరోక్కసారి ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది. అని అన్నారు
పోసానికృష్ణమురళీ, సత్య, ప్రొయరమణ, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ఃశ్రీచరణ్, కెమెరాఃమనోజ్‌రెడ్డి, ఎడిటర్‌గారీబిహెచ్, ఆర్ట్‌డైరెక్టర్ఃకిరణ్‌కుమార్ మన్నే, కొరియోగ్రాఫర్ః రఘుమాస్టర్, స్టోరీః నాగశౌర్య, స్ర్కీన్‌ప్లేఃరమణతేజ, ఫణీంద్రబిక్కిన, డైరెక్షన్ఃరమణ్‌తేజ, ప్రొడ్యూసర్ఃఉషాముల్పూరి, పిఆర్ ఓః ఏలూరుశ్రీను.