Social News XYZ     

Dasari Short Film Contest Awards Announced

"దాసరి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్" ఫంక్షన్ డీటెయిల్స్

Dasari Short Film Contest Awards Announced

Dasari Short Film Contest Awards Announced (Photo:SocialNews.XYZ)

దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆశయాలకు కొనసాగింపుగా.. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన 'దాసరి టాలెంట్ అకాడమీ' 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించడం తెలిసిందే. ఈ కాంటెస్ట్ లో విజేతలను ప్రకటించారు. ప్రముఖ నటులు డాక్టర్ మోహన్ బాబు, సహజనటి జయసుధ, సాక్షి ఎడిటోరియల్ అడ్వైజర్ కె.శ్రీరామచంద్రమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.నారాయణమూర్తి, సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

 

ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కు జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ, జ్యూరీ మెంబర్స్ గా ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, సీనియర్ రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి వ్యవహరించారు

మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో సుమారు 15 నిమిషాల నిడివితో రూపొందింస్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి విజేతలను ఎంపిక చేశారు. ప్రధమ బహుమతిగా 'పసుపు-కుంకుమ'కు లక్ష రూపాయలు, రెండో బహుమతి 'మాతృదేవోభవ'కి 50 వేలు, మూడవ బహుమతి తాతా మనవడు'కి 25 వేలుతో పాటు..
మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు 'నీహార్ ఈ సెంటర్' (niharecenter.com) సౌజన్యంతో అందజేశారు.

మరిన్ని వివరాలకు
Dasaritalentacademy.org

Facebook Comments