Social News XYZ     

Jayam fame Praneeth directs Tughlaq movie

జయం ఫేం ప్రణీత్ దర్శకత్వంలో "తుగ్లక్"

Jayam fame Praneeth directs Tughlaq movie

Jayam fame Praneeth directs Tughlaq movie (Photo:SocialNews.XYZ)

జయం చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. "తుగ్లక్" పేరుతో ప్రణీత్ పండగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీతా టాకీస్ బ్యానర్లో, పరమ గీత సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఆద్యంతం ఆసక్తి కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో "తుగ్లక్" టైటిల్ రోల్ ను ప్రముఖ నటుడు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్ లో తెరకెక్కించారు. హైదరాబాద్, రాజమండ్రిలో ఆఖరి షెడ్యూల్ తో సినిమా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా....

 

డైరెక్టర్ ప్రణీత్ పండగ మాట్లాడుతూ... మంచి లవ్ ఫీల్ కలిగిన స్టోరీతో ఉత్కంఠగా సాగే కథనంతో "తుగ్లక్" చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో "తుగ్లక్" పాత్రను ప్రముఖ నటుడు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని పాటలను కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్ లో తెరకెక్కించాం. మా నిర్మాత పరమ గీత గారు ఫుల్ సపోర్ట్ ఈ సినిమాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రహ్మానందం గారు కీరోల్ ప్లే చేస్తున్నారు. చలపతి రావు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ గా ఈ సినిమాకు రాహుల్ కెమెరా వర్క్ ప్రధాన బలం. మహేష్ ధీర అందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా స్టోరీ, స్క్రీన్ ప్లే కుదిరింది. హైదరాబాద్, రాజమండ్రిలో జరిగే ఆఖరి షెడ్యూల్ తో సినిమా పూర్తి చేయనున్నాం. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని చెప్పారు.

హీరో - రోహన్ సిద్ధార్థ
హీరోయిన్ - చైతన్య ప్రియ
నటీనటులు - బ్రహ్మానందం, చలపతి రావు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి తదితరులు

బ్యానర్ - గీతా టాకీస్
సమర్పణ - పరమ గీత
కో ప్రొడ్యూసర్స్ - గిరి, రజని
కెమెరామెన్ - రాహుల్ మాచినేని
సంగీతం -మహేష్ ధీర
పీఆర్వో - లక్ష్మీ నివాస్
కథ, మాటలు, దర్శకత్వం - ప్రణీత్ పండగ

Facebook Comments

%d bloggers like this: