Social News XYZ     

Hero Sriram’s role is special in Erra Chira movie

ఎర్రచీర’లో ప్రత్యేక ఆకర్షణగా శ్రీరామ్ పాత్ర

Hero Sriram's role is special in Erra Chira movie

Hero Sriram’s role is special in Erra Chira movie (Photo:SocialNews.XYZ)

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి డమరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎర్రచీర’. సీహెచ్ సుమన్‌బాబు స్వీయదర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఈ సినిమాలో ‘శ్రీరామ్’ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తెలిపారు. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా ఉండబోతున్నాయని, ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

 

ద‌ర్శ‌క‌నిర్మాత‌ సుమన్‌బాబు మాట్లాడుతూ-మొదటి షెడ్యూల్ పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను చిత్రీకరించాం. రెండో షెడ్యూల్లో మాత్రం కామెడీ, యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించనున్నాం. ఈ నెల 15వ తేదీన రెండో షెడ్యూల్ తెర‌కెక్కిస్తాం. మదర్ సెంటిమెంట్.. హార‌ర్ ఈ సినిమాలో ప్ర‌ధాన హైలైట్. శ్రీ‌రామ్ పాత్ర అంతే ప్ర‌త్యేకంగా ఉంటుంది అన్నారు.

సుమన్‌బాబు, కారుణ్య చౌదరి, .కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌, సురేష్ కొండేటి, మహానటి ఫేం బేబీ సాయి తుషితలు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: చందు, మాటలు: గోపీవిమలపుత్ర, మ్యూజిక్: ప్రమోద్ పులిగిల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సీహెచ్ సుమన్‌బాబు.

Facebook Comments

%d bloggers like this: