అసత్యపు వార్తలతో మమ్మల్ని బాధపెట్టొద్దు-సుధాకర్ కోమాకుల

Please don’t spread false news on the accident: Nuvvu Thopu Raa Hero Sudhakar Komakula (Photo:SocialNews.XYZ)
దర్శకుడు హరినాథ్‌బాబు మాట్లాడుతూ ఇంకా బాధలోనే ఉన్నాం. భగవంతుడి ఆశీస్సుల వల్లే క్షేమంగా బయటపడ్డాం. సీటుబెల్ట్ మమ్మల్ని రక్షించింది. మా తప్పిందం లేకపోయినా ఓ నిండు ప్రాణంపోవడం మమ్మల్ని కలిచివేసింది. ప్రమాదంలో మరణించిన లక్ష్మి కుటుంబానికి ఆర్థికం సహాయం చేస్తాం. ఏం జరిగిందో తెలుసుకోకుండా హీరో కారు నడుపుతున్నాడని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలతోమా రెండేళ్ల కష్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దు అని చెప్పారు
హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కారులో నేను ప్యాసింజర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్టర్నుఢీకొంది. ఈ ప్రమాదంలో నా కళ్లకు, చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో షాక్‌లో ఉన్న సమయంలో కారును నేనే డ్రైవ్ చేశారంటూ కొందరు వార్తలు రాశారు. ఇలా రాయడం సరికాదు. ఈవార్తలు చూసి అమెరికాలో ఉన్న నా భార్య బాధపడింది. ఇలాంటి వార్తాలతో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యాశెట్టి, నిర్మాత శ్రీకాంత్, ఎడ్మండ్రోజ్తదితరులు పాల్గొన్నారు.