Social News XYZ     

Sanchita Padukone to play female lead in Sriram’s Asalem Jarigindi movie

అసలేం జరిగిందిలో సంచితా పదుకునే 

Sanchita Padukone to play female lead in Sriram's Asalem Jarigindi movie

Sanchita Padukone to play female lead in Sriram’s Asalem Jarigindi movie (Photo:SocialNews.XYZ)

రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి  విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్ కొంత విరామం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ తెలియజేస్తూగ్రామీణ నేపథ్యంలో  కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హీరో శ్రీరామ్, సంచితాపదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగుఅమ్మాయిలా సంచితా పదుకునే ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాం. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

Facebook Comments
Sanchita Padukone to play female lead in Sriram's Asalem Jarigindi movie

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: