Social News XYZ     

Rakul Preet Singh to play the female lead in Manmadhudu 2

ఇప్పుడు బాలకృష్ణ రేపు నాగార్జున!

Rakul Preet Singh to play the female lead in Manmadhudu 2

Rakul Preet Singh to play the female lead in Manmadhudu 2 (Photo:SocialNews.XYZ)

నాగార్జున నటిస్తోన్న మన్మధుడు 2 సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వచ్చాయి, కానీ ఆ సినిమాకు పాయల్ కు ఎటువంటి సంభంధం లేదని చిత్ర వర్గాలు వెల్లడి చేశాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందని తెలుస్తోంది.

 

ఇటీవల బాలయ్య పక్కన ఎన్‌టి‌ఆర్ కథానాయకుడు సినిమాలో ఒక పాటలో నటించిన రకుల్ ఈసారి నాగార్జున పక్కన నటించడానికి ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు సుకుమార్ కామెరామెన్.

నాగార్జున ఈ సినిమాతో పాటు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. మన్మధుడు 2 చిత్రం రెగ్యులార్ షూటింగ్ మార్చి 15 నుండి హైదారాబాద్ లో ప్రారంభం కానుంది.

Facebook Comments

%d bloggers like this: