Social News XYZ     

Mahesh’s Maharshi to be postponed to June

మహేశ్ సినిమా మరోసారి వాయిదా!

Mahesh's Maharshi to be postponed to June

Hyderabad: Mahesh's 'Maharshi' second look unveils. (Photo: IANS)

మహేశ్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమా మొదట ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ను ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలిపారు. కానీ ఈ డేట్ కు కూడా సినిమా రాకపోవచ్చు అంటున్నారు.

 

సినిమాలో అధికభాగం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని షూట్ చెయ్యాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయని అందుచేత సినిమా ఆలస్యం కానుందని అంటున్నారు. మహేశ్ బాబు చేస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ మూవీని జాగ్రత్తగా చేస్తూ వస్తున్నాడు మహేశ్ బాబు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీ దత్, పి.వి.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేశ్ మహేశ్ బాబు స్నేహితుడిగా కనిపించబోతున్నాడు.

Facebook Comments

%d bloggers like this: