Social News XYZ     

Trivikram to repeat Pooja Hegde?

త్రివిక్రమ్ హీరోయిన్ ను రిపీట్ చెయ్యబోతున్నాడా ?

Trivikram to repeat Pooja Hegde?

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. చిత్ర నిర్మాతలు ఈ హీరోయిన్ డేట్స్ ఏప్రిల్ నుండి అడిగారని టాక్ వినిపిస్తోంది.

 

త్రివిక్రమ్ లాస్ట్ సినిమా అరవింద సమేత సినిమాలో నటించిన పూజా హెగ్డే బన్నీ సినిమాలో నటించబోతుండడం విశేషం. బన్నీ ఇదివరుకే పూజా హెగ్డే తో కలిసి డీజే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇద్దరు జతకట్టబోతున్నారు.

తండ్రి కొడుకుల మధ్య జరిగే ఈ సినిమాను హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నగ్మా బన్నీ పేరెంట్స్ గా నటించబోతున్నారు. మార్చి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న బన్నీ ఈ సినిమాతో సక్సెస్ కొడతాడేమో చూడాలి.

Facebook Comments

%d bloggers like this: