Social News XYZ     

Censor members appreciate Mithai movie

మిఠాయికి సెన్సార్ సభ్యుల ప్రశంసలు

Censor members appreciate Mithai movie

Censor members appreciate Mithai movie (Photo:SocialNews.XYZ)

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మిఠాయి. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో డా.ప్రభాత్ కుమార్ నిర్మించారు. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు చిత్రం బావుందంటూ ప్రశంసించారని చెప్పారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిదని ఆయన వెల్లడించారు. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయని ఆయన తెలిపారు. రాహుల్ రామకృష్ణ, ప్రియధర్శిల అభినయం సినిమాకే ఓ హైలైట్ అని చెప్పారు. కథానుసారం నవరసాలను మేళవించి దర్శకుడు చిత్రాన్ని ఎంతోబాగా మలిచారని అన్నారు. వివేక్ సాగర్ సంగీతం వీనులవిందుగా ఉంటుందని, మొత్తంమీద థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకుడికి ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుందని అన్నారు.

 

ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖెల్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి పాటలు-కిట్టు విస్సాప్రగఢ, మాటలు-బి.నరేష్ రెడ్డి, సంగీతం-వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ-రవివర్మన్ నీలమేఘం, ఎడిటింగ్-గ్యారీ బి.హెచ్.

Facebook Comments
Censor members appreciate Mithai movie

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: