Social News XYZ     

Jagapathi Babu in Subhalagnam squeal !!

హిట్ సినిమా సీక్వెల్ లో జగపతి బాబు!

Jagapathi Babu in Subhalagnam squeal !!

జగపతిబాబు హీరోగా ఎస్. వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. జగపతిబాబే ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

 

ఇప్పుడు ఉన్న జనరేషన్ కు తగ్గట్లు కొన్ని మార్పులు చేసి ఈ సినిమాకు సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నారు. ఒక నూతన దర్శకుడు డైరెక్ట్ చెయ్యబోతున్న ఈ సినిమాను 70 ఏం.ఏం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించబోతోంది. ఇటీవల ఈ సంస్థ నుండి యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

జగపతి బాబు హీరోగా మానేసి నెగిటివ్ పాత్రలు చేస్తున్నారు. శుభలగ్నం సినిమా కథకు కొనసాగింపు చేస్తే బాగుంటుందని భావించిన జగపతిబాబు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని భావించడం విశేషం. ఈ సినిమా గురించి పూర్తి సమాచారం త్వరలో చిత్ర నిర్మాతలు ప్రకటించనున్నారు.

Facebook Comments

%d bloggers like this: