Social News XYZ     

Alia Bhatt & Parineeti Chopra quotes a huge rate for RRR?

రాజమౌళికి షాక్ ఇచ్చిన బాలివుడ్ హీరోయిన్స్!

Alia Bhatt & Parineeti Chopra quotes a huge rate for RRR?

ఎన్‌టి‌ఆర్, చరణ్ నటిస్తోన్న మల్టీ స్టారర్ చిత్ర షూటింగ్ హైదారాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ ఎవరనేది క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయం గురించి ఒక న్యూస్ మీడియా సర్కల్ లో చక్కర్లు కొడుతోంది.

 

బాలివూడ్ హీరోయిన్స్ ఆలియా భట్ ఈ సినిమా కోసం 5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే మరో హింది హీరోయిన్ పరిణితి చోప్రా ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమాల్లో ఎప్పుడు ఇంత భారీ మొత్తం హీరోయిన్ కు ఇవ్వలేదు. కానీ వారు బాలివూడ్ లో ఫేమస్ కావున అంతా భారీగా డిమాండ్ చేస్తున్నారు.

హీరోయిన్స్ కు అంత భారీ మొత్తంలో ఇవ్వాలా ? తెలుగు సినిమాలు చేసిన నార్మల్ హీరోయిన్స్ ను పెట్టుకోవాలా అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. అలాగే ఈ సినిమా కోసం అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక క్లారిటీ రానుంది.

Facebook Comments

%d bloggers like this: