Social News XYZ     

Silence Please movie to release on March 1st

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని స్ఫూర్తిగా భీమవరం టాకీస్ " సైలెన్స్ ప్లీజ్"

Silence Please movie to release on March 1st

Silence Please movie to release on March 1st (Photo:SocialNews.XYZ)

బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ 'నిశ్శబ్ద-2'. ఈ చిత్రాన్ని తెలుగులో 'సైలెన్స్ ప్లీజ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు.  వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.
మార్చ్ 1న, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

చిత్ర నిర్మాత-భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే టెరిఫిక్ థ్రిల్లర్ 'సైలెన్స్ ప్లీజ్'. అన్ని పనులు పూర్తయ్యాయి. మహాశివరాత్రికి భక్తులంతా మౌనవ్రతం పాటిస్తుంటారు కాబట్టి,  మా 'సైలెన్స్ ప్లీజ్' చిత్రాన్ని ఆ రోజు విడుదల చేస్తున్నాం. 2018లో కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటైన ఈ చిత్రం తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం' అన్నారు!

అవినాష్, పెట్రోల్ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, మ్యూజిక్: సతీష్ ఆర్యన్, సమర్పణ: వల్లూరిపల్లి రమేష్, నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వం: దేవరాజ్ కుమార్!!

Facebook Comments
Silence Please movie to release on March 1st

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: