Social News XYZ     

Amala to act in Nagarjuna’s Manmadhudu 2 movie!

నాగార్జున సినిమాలో అమల !

Amala to act in Nagarjuna's Manmadhudu 2 movie!

అక్కినేని నాగార్జున మార్చి నుండి మన్మధుడు 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటించబోతోంది. మరో హీరోయిన్ ఈ మూవీలో కనిపించబోతోంది.

 

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నాగార్జున భార్య అమల నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున, అమల కలిసి గతంలో కొన్ని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత అమల నాగార్జున తో కలిసి నటించబోతుండడం విశేషం.

చిలాసౌ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న రాహుల్ రవీంద్రన్ నాగార్జునతో సినిమా చెయ్యబోతుండడం విశేషం. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మూవీతో పాటు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ లో నటించబోతున్నాడు.

Facebook Comments

%d bloggers like this: