Social News XYZ     

Bellamkonda to work with Rx 100 director Ajay Bhupathi

హిట్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో క్రేజీ హీరోయిన్ !

అల్లుడుశీను సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా తరువాత తీసిన రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు తేజతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సీత టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్.

ఈ సినిమా తరువాత ఆర్.ఎక్స్.100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి తో ఒక సినిమా చెయ్యనున్నడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ హీరో మొదటి సినిమాలో నటించిన సమంత మళ్ళీ నటించబోతుండడం విశేషం.

 

ఈ సినిమాకు సంభందించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ బయట రూమర్స్ వస్తున్నాయి. తేజ సినిమా ఆడితే కానీ ఈ హీరోకు మార్కెట్ రాదు. మరి సమంత కూడా ఈ ప్రాజెక్టు ను సైన్ చేసిందా అంటే క్లారిటీ లేదు. ఏదైనా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Facebook Comments

%d bloggers like this: