Social News XYZ     

Who will play the female lead in Allu Arjun – Trivikram movie?

అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరు ?

Who will play the female lead in Allu Arjun - Trivikram movie?

Who will play the female lead in Allu Arjun – Trivikram movie?

త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్ పేరు తాజాగా వినిపిస్తోంది.. మరి కీర్తి ఈ సినిమా నిజంగా చెయ్యనుందా అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. మహానటి సినిమా తరువాత కీర్తి సురేశ్ చేయబోయే సినిమా ఇదే అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కైరా అద్వానీ బన్నీ పక్కన నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా ఆ హీరోయిన్ ను తీసుకోవడం లేదని సమాచారం. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా కామిడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తరహాలోనే ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Facebook Comments

%d bloggers like this: