Social News XYZ     

Shraddha Srinath to play female lead in Balakrishna-Boyapati movie!!

బాలయ్య పక్కన నాని హీరోయిన్ !

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. రాజకీయ నేపద్యంలో ఈ కథాంశాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ నటించనుందని సమాచారం.. ప్రస్తుతం ఈ హీరోయిన్ నాని నటిస్తోన్న జర్సీ సినిమాలో నటిస్తోంది. కాస్త ఏజ్ ఎక్కువగా ఉన్న ఈ హీరోయిన్ బాలయ్య పక్కన సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

కథ పరంగా హీరో కంటే హీరోయిన్ వయసు ఎక్కువగా ఉండాలి కావున ఈ హీరోయిన్ ను జర్సీ సినిమాలో తీసుకోవడం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ అంటే అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. వీరిద్దరు కలిసి చేస్తోన్న మూడో సినిమా ఇది.

Facebook Comments

%d bloggers like this: