సూపర్ స్టార్ సినిమాకు ముహూర్తం ఖరారు !.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా పేట ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా తరువాత రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానుంది.
లైకా పిక్చర్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. రాజకీయ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మురుగదాస్ ఇటీవల సర్కార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తన తదుపరి సినిమా కూడా రాజకీయ నేపద్యంలో ఉండబోతుండడం విశేషం. రజినీకాంత్, మురుగదాస్ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు తలెత్తడం సహజం.
