Social News XYZ     

Allu Arjun to work with Sujeeth?

ప్రభాస్ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా !

Allu Arjun to work with Sujeeth?

Allu Arjun to work with Sujeeth? (Photo:SocialNews.XYZ)

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ ప్రభాస్ తో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కౌతున్న ఈ సినిమాను యు.వి.క్రియెషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

 

ఈ సినిమా తరువాత సుజిత్ అల్లు అర్జున్ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదివరుకే బన్నీని కలిసి సుజిత్ ఒక లైన్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.

ప్రభాస్, అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్స్ కావున బన్నీతో సినిమా చెయ్యడానికి ప్రభాస్ సుజిత్ కు హెల్ప్ చేసి ఉండవచ్చని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక ప్రముఖ బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Facebook Comments

%d bloggers like this: