Social News XYZ     

Varun Tej’s next will be launched on January 27th

మెగా హీరో సినిమాకు ముహూర్తం కుదిరింది !

Varun Tej's next will be launched on January 27th

14 రీల్స్ సంస్థలో వరుణ్ తేజ్ చెయ్యబోతున్న సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా జనవరి 27న ప్రారంభం కానుంది. ఎఫ్ 2 సినిమా తరువాత వరుణ్ తేజ్ చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో నాగ శౌర్య లేదా సుధీర్ బాబు నటించే అవకాశాలు ఉన్నాయి.

 

తమిళ్ లో విజయం సాధించిన జిగర్ తాండ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్. రీమేక్ సినిమాను తీసి గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు నూతన దర్శకుడు కిరణ్ తో బాక్సింగ్ నేపద్యంలో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. త్వరలో ఆ సినిమా ప్రారంభం కానుంది. డిఫరెంట్ కన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ హరీష్ శంకర్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేయడం విశేషం.

Facebook Comments

%d bloggers like this: