Social News XYZ     

Nidhhi Agerwal replaces Eesha Rebba !

ఒక హీరోయిన్ స్థానంలో మరో హీరోయిన్ !

భవ్య క్రియెషన్స్ సంస్థలో నాగ శౌర్య హీరోగా ఇషా రెబ్బ హీరోయిన్ గా ఒక సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా కొన్ని రోజుల షూటింగ్ జరిగింది, ఆ తరువాత తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఈ చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలుగుదేశం తరుపున ఎన్నికల్లో పోటీ చెయ్యడంతో సినిమా షూటింగ్ కు కొంత విరామం లభించింది.

తాజా సమాచారం మేరకు ఈ చిత్ర షూటింగ్ మళ్ళీ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకుడు. అయితే ఈ సినిమాలో ఇషా రెబ్బ స్థానంలో నిధి అగర్వాల్ వచ్చినట్లు సమాచారం. ఈ హీరోయిన్ నాగ చైతన్య తో సవ్యసాచి చేసింది. అలాగే అఖిల్ తో మజ్ను సినిమాలో నటిస్తోంది.

 

ఇషా స్థానంలో నిధి ఎందుకు వచ్చింది అనే విషయంలో క్లారిటీ లేదు. లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశం ఉంది. నాగ శౌర్య ప్రస్తుతం ఈ సినిమాతో పాటు సమంత హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Facebook Comments

%d bloggers like this: