Social News XYZ     

Nani’s Jersey movie teaser is impressive

ఆసక్తికరంగా నాని జర్సీ టీజర్!

Nani's Jersey movie teaser is impressive

నాని లేటెస్ట్ సినిమా జర్సీ టీజర్విడుదల అయ్యింది. ‘నీ వయసు ఇప్పుడు 36 అర్జున్‌. అది ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ నుంచి రిటైర్‌ అయ్యే వయసు..’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైన టీజర్ ఆసక్తికంగా ఉంది. ‘ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ.. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు’ అంటూ నాని చివర్లో చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

 

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం మెయిన్ హైలెట్ గా నిలువనుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌‌‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్‌ సినిమాను సమర్పిస్తున్నారు. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నాని క్రీకెటర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

నాని ఈ సినిమాతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

Facebook Comments

%d bloggers like this: