Social News XYZ     

What are the current expectations for Sankranti movies?

సంక్రాంతి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ?

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అన్నీ సినిమాల పైన మంచి హోప్స్ ఉన్నాయి. ట్రైలర్స్ తో అన్నీ సినిమాలు ప్రేక్షకులను తమ వైపు తిప్పుకున్నాయి. ఏ జానర్ సినిమాలు ఇస్టపడే వారు ఆ జానర్ సినిమాలను ఈ సంక్రాంతికి చూసే అవకాశం ఉంది.

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ సినిమాను ఎన్‌టి‌ఆర్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. ట్రైలర్, పాటలు బాగుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్‌టి‌ఆర్ పుట్టిన దగ్గర నుండి రాజకీయాల్లోకి వచ్చే వరుకు ఎన్‌టి‌ఆర్ కథానాయకుడు సినిమా ఉండబోతోంది.

 

పేట సినిమా రజినీ స్టైల్ లో ఉండే విలేజ్ స్టోరీగా ఉండబోతోంది. తమిళ్ లో ఈ సినిమాకు ఉన్నంత అంచనాలు తెలుగులో లేవు. అయినా సరే రజినీ అభిమానులు చూస్తారు. ఎఫ్ 2 కామిడీ ఎంటెర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించబోతోంది. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ఉంది. వినయ విధేయ రామ సినిమా మాస్ ఆడియన్స్ ను అలరించే అవకాశాలు ఉన్నాయి.

Facebook Comments