Social News XYZ     

Bigg Boss 2 Telugu fame Nutan Naidu signed 14 films

14 సినిమాల్లో నూతన్ నాయుడు..!

Bigg Boss 2 Telugu fame Nutan Naidu signed 14 films

బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నూతన్ నాయుడు ఒకటీ రెండు కాదు ఏకంగా 14 సినిమాల్లో బుక్ అయ్యాడంట. అవికూడా చిన్నా చితకాసినిమాలు కాదు. పెద్ద పెద్ద హీరోలు నటించిన మల్టీ స్టారర్ మూవీస్.

 

సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నిర్మితం అవుతున్న ఆర్.ఆర్.ఆర్. మూవీతోపాటు మెగా స్టార్ హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సైరా లో కూడా నూతన్ నాయుడు ముఖ్యమైన పాత్ర దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మీద, డీవీవీ దానయ్య సినిమాలోనూ, మహేష్ బాబు మూవీలోనూ నూతన్ నాయుడు కనిపించబోతున్నట్టు సినీ వర్గాల సమాచారం. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజకీయ ప్రాధాన్యత ఉన్న సినిమాలోనూ, వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న యాత్ర లోనూ నూతన్ నాయుడు నటించినట్టు తెలుస్తోంది.

రెండు హారర్ మూవీస్, రెండు మల్టీ స్టారర్ మూవీస్ లోనూ, ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలోనూ మొత్తం 14 సినిమాల్లో నూతన్ నాయుడు అవకాశం దక్కించుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో ఒక ముఖ్యమైన పాత్రతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తున్న నూతన్ నాయుడు భవిష్యత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Facebook Comments